News March 29, 2025
పెద్దపల్లి: పరువు హత్య UPDATE..

ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రేమ వ్యవహారంతో యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. A-1 ముత్యం సదయ్య (యువతి తండ్రి), A-2 ముత్యం సమత (యువతి తల్లి), A-3 సిద్ధ సారయ్య (యువతి మేనమామ) పై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు ప్రేరేపించిన ఇతరులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 2, 2025
సిరిసిల్ల: సర్దార్ పాపన్న పోరాటం మరువలేనిది: కలెక్టర్

బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం మరువలేనిదని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సర్ధార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయన చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని స్పష్టం చేశారు.
News April 2, 2025
అనంతపురం జిల్లాలో HM సస్పెండ్

అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPHS హెచ్‌ఎం శ్రీనివాస్ ప్రసాద్‌పై పాఠశాల విద్య కడప RJD శామ్యూల్ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ZPHSలో పరీక్ష రాసేందుకు 10th విద్యార్థిని వెళ్లింది. పరీక్ష జరిగే సమయంలో ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం మిస్ అయిందని చెప్పగా.. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆమెను భుజంపై కర్రతో కొట్టారు. దీంతో విద్యార్థిని కాలర్ బౌన్ విరిగగా ఆయనను సస్పెండ్ చేశారు.
News April 2, 2025
HCU భూములపై NGTలో ఫిర్యాదు

హైదరాబాద్ HCU భూముల వేలంపాట అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు చేరింది. వేలం పాట అనైతికం అని న్యాయవాది కారుపోతుల రేవంత్ చెన్నైలోని NGTలో ఫిర్యాదు చేశారు. వేలంపాటను అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నగరానికి కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్న ఇలాంటి ప్రాంతాలను నాశనం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.