News January 23, 2025

పెద్దపల్లి- రంగాపూర్ ప్రధాన రహదారి వద్ద చెట్టును ఢీకొట్టిన కారు

image

పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామం వద్ద ప్రధాన రహదారికి అనుకుని ఉన్న చెట్టును కారు ఢీ కొట్టింది. అయితే ప్రమాదం ఎప్పుడూ జరిగింది. అందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో తెలియలేదు. కారులో ఉన్న వ్యక్తులకు కాళ్లు విరిగినట్లు, తలకు గాయాలయయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 23, 2025

మూడో తరగతి విద్యార్థి ఫీజు రూ.2.1 లక్షలు

image

చదువును కొందరు బిజినెస్‌గా మార్చేశారని విమర్శలొస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెమటోడుస్తున్న తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో కొన్ని స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్కూల్‌లో మూడో తరగతి ఫీజు షాక్‌కి గురిచేస్తోంది. పిల్లాడి చదువుకోసం ఏడాదికి రూ.2.1 లక్షలు చెల్లించాలా? అంటూ సీఎం సిద్ద రామయ్యను ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

News January 23, 2025

విశాఖ-దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదింపు

image

విశాఖ-దుర్గ్ వందేభారత్ (20829/30) ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రైలు 16 కోచ్‌లతో నడిచేది. అయితే జనవరి 24వ తేదీ నుంచి 8 కోచ్‌లతో మాత్రమే నడుస్తుందని ఆయన తెలిపారు. అందులో ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్, ఏడు ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News January 23, 2025

కృష్ణా: కమిషనరేట్‌లో నేతాజీ జయంతి

image

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మచిలీపట్నం పోలీస్ కమిషనరేట్‌లో  గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ రావు, పోలీస్ సిబ్బంది సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఉన్న ప్రేరణాత్మక ఘట్టాలను వివరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి మిఠాయి పంచిపెట్టారు.