News April 20, 2025

పెద్దపల్లి: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందున ఈ సోమవారం ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లా ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

Similar News

News April 21, 2025

‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

image

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్‌గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్‌ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్‌కు ఎంపీ రిప్లై ఇచ్చారు.

News April 21, 2025

మహబూబాబాద్‌లో తహశీల్దార్లు బదిలీలు

image

మహబూబాబాద్ జిల్లాలో 8 మండలాల్లో పనిచేస్తున్న తహశీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గార్ల తహశీల్దారుగా శారద, సీరోల్-నారాయణమూర్తి, దంతాలపల్లి-సునీల్ కుమార్, గూడూరు-చంద్రశేఖర రావు, ఇనుగుర్తి-రవీందర్, కురవి-శ్వేత నూతన తహసీల్దార్లుగా నియమితులయ్యారు.

News April 21, 2025

ఈ వారంలో ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్: నాగవంశీ

image

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ మూవీపై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

error: Content is protected !!