News April 5, 2025
పెద్దపల్లి వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను పెద్దపల్లి జిల్లాలోని MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE
Similar News
News April 6, 2025
విచారణకు మళ్లీ గైర్హాజరైన కమ్రా

కమెడియన్ కునాల్ కమ్రా మూడోసారీ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. మహారాష్ట్ర Dy.CM శిండేపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు సమన్లు ఇచ్చిన పోలీసులు నిన్న విచారణకు రావాలంటూ నోటీసులు పంపగా వాటికి ఆయన స్పందించలేదు. తమిళనాడులోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా అక్కడ లేకపోవడంతో వాట్సాప్‌లో సందేశం పంపించామని, కమ్రా నుంచి స్పందన లేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
News April 6, 2025
మహబూబ్‌నగర్: శ్రీరాముని పాదం చూశారా?

MBNR జిల్లా కోయిలకొండలోని మహిమాన్విత క్షేత్రమైన శ్రీరామకొండ సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పాదం స్వయంభుగా వెలసిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ తన పాదం మోపి సేదతీరినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్లే సమయంలో ఇక్కడ ఒక మూలికపడి కొండ మొత్తం వనమూలికలకు ప్రసిద్ధగా మారిందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడి కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉండడం విశేషం.
News April 6, 2025
శ్రీరామనవమికి సంగారెడ్డి జిల్లాలో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. మత సంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మతసామరస్యం నెలకొంటుందని తెలిపారు. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలలో శ్రీరామనవమి ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.