News February 1, 2025

పెద్దపల్లి: విద్యా కమిషన్ ప్రజా అభిప్రాయ సేకరణ: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరి 4న తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్‌ రాష్ట్ర నూతన విద్య పాలసీ రూపకల్పన పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రాష్ట్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం విద్యా కమిషన్‌కు బాధ్యతలు అప్పగించిందని, అభిప్రాయాలను విద్యా కమిషన్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు.

Similar News

News February 2, 2025

రైల్వేకు కేటాయింపులు ఇలా(రూ.కోట్లలో)

image

✒ మొత్తం బడ్జెట్- 2,65,200
✒ ఉద్యోగుల పెన్షన్ ఫండ్- 66,000
✒ రైల్వే సేఫ్టీ ఫండ్- 45,000
✒ కొత్త లైన్ల నిర్మాణం- 32,235
✒ లైన్ల డబ్లింగ్- 32,000
✒ గేజ్ లైన్లుగా మార్పునకు- 4,500
✒ విద్యుత్ లైన్లు- 6,150
✒ సిబ్బంది సంక్షేమం- 833
✒ ఉద్యోగుల శిక్షణ- 301

News February 2, 2025

బోథ్: బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గోవర్ధన్

image

తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బోథ్‌కు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు భారతాల గోవర్ధన్ నియమితులయ్యారు. గత రెండు రోజులుగా AITUC మహాసభలు జగిత్యాల జిల్లా కోరుట్లలో జరగగా ఆ మహాసభల్లో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం గోవర్ధన్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. బీడీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని గోవర్ధన్ తెలిపారు.

News February 2, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 02, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
✒ ఇష: రాత్రి 7.26 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.