News February 25, 2025
పెద్దపల్లి: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం, గోదావరిఖని, మంథని, రామగిరి, 8ఇంక్లైన్ కాలనీ ఏరియాల్లో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
Similar News
News February 25, 2025
పార్వతీపురం: ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

స్థానిక మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు నిక్షిప్తంగా భద్రపరచిన గోడౌన్‌ను పీరియాడిక్ తనిఖీల్లో భాగంగా అక్కడ భద్రత, గోడౌన్‌కు వేసిన సీల్‌లను నిశితంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు.
News February 25, 2025
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 25, 2025
మద్దతిచ్చినందుకు థాంక్యూ ట్రంప్: వివేక్ రామస్వామి

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికన్ హిందూ, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి థాంక్స్ చెప్పారు. ఓహైయో గవర్నర్ అభ్యర్థిగా ఎండార్స్ చేయడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తామంతా ఆయనకు అండగా ఉంటామని, ఓహైయోను మళ్లీ గొప్పగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘వివేక్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయనెంతో స్పెషల్, యంగ్, స్మార్ట్’ అంటూ ట్రంప్ ట్వీట్ చేయడం తెలిసిందే.