News April 8, 2025
పెద్దపల్లి: సోలార్ విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సోలార్ విద్యుత్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ పథకం క్రింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. కిలో వాట్‌కు రూ.30 వేలు, 2 కేడబ్ల్యూకు రూ.60 వేలు, 3 కేడబ్ల్యూకు రూ.78 వేల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు.
Similar News
News April 19, 2025
తిరుమల: దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న 58,519 మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.27 కోట్ల ఆదాయం సమకూరింది.
News April 19, 2025
రామాపురం: మృతుడు TDP నాయకుడిగా గుర్తింపు

అన్నమయ్య జిల్లా రామాపురంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హసనాపురం పంచాయతీ గొల్లపల్లికి చెందిన TDP నాయకుడు ఇరగంరెడ్డి(50) కడపలో బంధువుల పెళ్లికి బైకుపై బయల్దేరారు. రామాపురం పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వెళ్తున్న కారు ఢీకొట్టడంతో చనిపోయారు. ఆయన మృతికి మంత్రి మండిపల్లి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మృతి TDPకి తీరని లోటని పేర్కొన్నారు.
News April 19, 2025
కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.