News February 3, 2025

పెద్దపల్లిలో MLC కవిత పర్యటన

image

పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత నేడు పర్యటిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష తెలిపారు. రంగాపూర్‌లో కార్మిక నాయకుడు కౌశిక్ హరి కూతురి వివాహానికి హాజరుకానున్నారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం 12:15కు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో నిర్వహించే టీబీజీకేఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారన్నారు.

Similar News

News February 3, 2025

17% పెరిగిన జీఎస్టీ ఆదాయం

image

తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.

News February 3, 2025

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ

image

ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే విచారించి పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ తగిన సమయంలో విచారించి న్యాయం చేయాలన్నారు.

News February 3, 2025

వరంగల్: ప్రజావాణిలో ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఆర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారదాదేవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.