News February 6, 2025
పెద్దపల్లిలో బాలికల బాలసదనం ప్రారంభం
పెద్దపల్లి జిల్లాలోని అనాథ బాలికలకు ప్రభుత్వం బాల సదనం ప్రారంభించిందని వయోవృద్ధుల శాఖ అధికారి పి.వేణుగోపాలరావు తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాల వయస్సులోపు అనాథ బాలికలను అడ్మిషన్ చేసుకుంటామని తెలిపారు. ఉచిత వసతి, విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివించి వివాహం కూడా జరిపిస్తామని తెలిపారు.
Similar News
News February 6, 2025
నేడు విజయవాడకు మంత్రి లోకేశ్
విజయవాడకు గురువారం మంత్రి లోకేశ్ రానున్నారు. ఉదయం 9.30 గంటలకు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్‌లో హ్యాక్‌థాన్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్ పాల్గొంటారు. వివిధ సంస్థల నుంచి 1300 మంది మేధావులు హాజరుకానున్నారు. ఏఐలో స్వర్గీయ నందమూరి తారకరామారావు మాట్లాడనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 6, 2025
INDvsENG: అత్యధిక విజయాలు మనవే
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు 107 వన్డేలు జరిగాయి. వీటిలో టీమ్ ఇండియా 58 మ్యాచులు, ఇంగ్లండ్ 44 మ్యాచుల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్‌లు టై అవ్వగా మరో 3 రద్దయ్యాయి. స్వదేశంలో 52 మ్యాచులు జరగగా భారత జట్టు 34 విజయాలు సాధించింది. ఇవాళ తొలి వన్డే జరిగే నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో తుది జట్టులోకి స్పిన్నర్ వరుణ్‌ను తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
News February 6, 2025
WNP: బైక్, లారీ ఢీ.. ఒకరి దుర్మరణం
బైక్‌ని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పాన్‌గల్ మండలం రేమొద్దులకి చెందిన నర్సింహారెడ్డి(55) తన సొంత పనుల మీద బైక్‌పై విలియంకొండకు వచ్చారు. తిరిగి ఇంటికెళ్తుండగా.. కొత్తకోట మదర్‌థెరిసా జంక్షన్ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కేసు నమోదైంది.