News April 22, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి విక్రయాలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇటీవల వర్షాలు, ధర పెరుగుతుందన్న కారణంగా రైతులు మార్కెట్‌కు పత్తిని తక్కువగా తీసుకొస్తున్నారు. పత్తి విక్రయాలు స్వల్పంగా ధర పెరిగింది. ప్రస్తుతం పత్తి నాణ్యతను బట్టి క్వింటాల్‌కి రూ.6,800 నుంచి రూ.7,200 వరకు ధర పలుకుతోంది.
Similar News
News April 22, 2025
బీఆర్ఎస్ సభకు ప్రత్యేక ఏర్పాట్లు: జైపాల్ యాదవ్

వరంగల్లో బీఆర్ఎస్ సభకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లేందుకు 35 బస్సులు, 300 బైకులు ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. మంగళవారం కడ్తాల్ లో పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. సభకు తరలి వెళ్లే ముందు ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
News April 22, 2025
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలు తెలుగు-39, హిందీ-23, ఇంగ్లిష్-95, లెక్కలు-94, ఫిజిక్స్-24, బయాలజీ-70, సోషల్-106, PET- 72, SGT- 106 జిల్లా విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే DSC దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, మే- 15వ తేదీతో ముగుస్తుందని అధికారులు వెల్లడించారు. జూన్ 6, జూలై 6 తేదీల మధ్యలో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు.
News April 22, 2025
J&Kలో ఉగ్రదాడి.. ఖండించిన సీఎంలు

J&Kలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.