News July 28, 2024

పెద్దాపురం: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దాపురం జవహార్ నవోదయ విద్యాలయం (2025-2026)లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పెద్దాపురం విద్యాలయ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రామకృష్ణయ్య తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని 43 మండలాల నుంచి ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు అర్హులన్నారు. సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2025 జనవరి 18న పరీక్ష జరుగుతాయన్నారు.

Similar News

News November 25, 2024

యువత భవితకు భరోసాగా నిలబడతాం: మంత్రి లోకేశ్

image

మంత్రి లోకేశ్‌ను కలిసే అవ‌కాశం ద‌క్కాల‌ని విజయవాడ ఇంద్ర‌కీలాద్రిని మోకాలిపై ఎక్కి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రామచంద్రపురం మండలం చౌడవరం వాసి సాయికృష్ణని లోకేశ్ సోమవారం క‌లిశారు. ‘అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. వైసీపీ అరాచ‌క‌ పాలనపై ప్ర‌జాస్వామ్య‌ ప‌ద్ధ‌తిలో పోరాడిన త‌న‌ను ఇబ్బందులు పెట్టారు. యువ‌త భ‌విత‌కు భ‌రోసాగా నిల‌బ‌డ‌తాన‌ని అతనికి హామీ ఇచ్చా’ అని లోకేశ్ ‘X’లో పేర్కొన్నారు. 

News November 25, 2024

ఫీజు రీయంబర్స్మెంట్‌ను వారికే నేరుగా వేస్తాం: కలెక్టర్

image

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్‌ను విద్యా సంస్థలకే నేరుగా విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు త్వరలోనే ఈ ఏడాదికి సంబంధించిన మొత్తం మంజూరు చేస్తామని, దశల వారీగా బకాయిలు సైతం విడుదల చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పష్టమైన హామీనిస్తూ ఆ ప్రకటనలో తెలిపారు.

News November 25, 2024

రాజమండ్రిలో వ్యభిచారం.. యువతుల అరెస్ట్

image

స్పా సెంటర్ మాటున వ్యభిచారం చేయడం రాజమండ్రిలో కలకలం రేపింది. తాడితోటలో సతీశ్, లక్ష్మి బ్యూటీ సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్ టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. అక్కడ మసాజ్ చేస్తున్న ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ షాపును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.