News February 13, 2025
పెద్దేముల్: సెలవు ఇవ్వాలని డిమాండ్
ఫిబ్రవరి 15న శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేనావత్ రవికుమార్, మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పెద్దేముల్ తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. దేశంలో 15 కోట్ల మంది, రాష్ట్రంలో 40 లక్షలమంది లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, గోవింద్ నాయక్, సవిత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 14, 2025
రామగుండం: BRS వాళ్లు ఓర్వడం లేదు: MLA
దేశం మొత్తం గర్వపడేలా తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని రామగుండం MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇటు రాష్ట్రంలో BRS.. అటు దేశంలో BJPబీసీలను, బహుజనులను హీనంగా చూసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే BRSవాళ్లు ఓర్వడం లేదని, అందుకే గగ్గోలు పెడుతూ కపట ప్రేమను కురిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.
News February 14, 2025
MNCL: బురద గుంటలో పడి వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్‌లో గురువారం బురద గుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని సీఐ ప్రమోద్ రావు తెలిపారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712656534 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News February 14, 2025
చిన్నారెడ్డి పుదుచ్చేరి సెంటిమెంట్.!
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో ఎన్నికలలో పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చిన్నారెడ్డిని సెంటిమెంట్‌గా భావిస్తారు. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో HYDలోని ప్రజాభవన్‌లో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కందస్వామి చిన్నారెడ్డితో భేటీ అయ్యారు.