News February 15, 2025

పెనమలూరు: ఆన్‌లైన్‌లో రూ.1.55 లక్షల స్వాహా

image

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్‌కు`Global India Private Limited’ పేరుతో అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన రూ.1.55 లక్షలు జమ చేశారు. తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Similar News

News December 15, 2025

కృష్ణా ఫెన్సింగ్‌కు కాంస్య పతకాలు

image

గుంటూరు జిల్లా వెనిగండ్లపాడులో జరిగిన అంతర జిల్లాల ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-19 విభాగంలో బాలికల శాబర్ జట్టు, బాలుర ఇప్పి జట్టు, బాలుర ఫోయిల్ జట్లు కాంస్య పతకాలను సాధించాయి. కృష్ణా జిల్లా ఫెన్సింగ్ శిక్షకులు ధనియాల నాగరాజు విజేతలను అభినందనలు తెలిపారు.

News December 14, 2025

రేపు గుడివాడకు రానున్న వందే భారత్

image

వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుడివాడలో కూడా ఆగనుంది. చెన్నై-విజయవాడ వందే భారత్ (20677) రైలును నర్సాపురం వరకు రైల్వే శాఖ పొడిగించింది. అయితే నర్సాపూర్, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్, బెంగళూరుకు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News December 13, 2025

గన్నవరం: పంచాయతీ ఎన్నికలు.. వంశీ వ్యూహంపై ఆసక్తి.!

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మైనింగ్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయడానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే వంశీ ఇటీవల పార్టీ సమావేశాల్లో పాల్గొనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ఆయన వ్యూహ రచన ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.