News February 15, 2025
పెనుకొండ ఉపాధ్యాయుడికి జైలు శిక్ష

పెనుకొండకు చెందిన మాజీ పాత్రికేయుడు మహేశ్ వద్ద ఐదేళ్ల క్రితం రూ.3.24 లక్షలను ఉపాధ్యాయుడు సూర్యనారాయణ రెడ్డి అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం న్యాయమూర్తి సయ్యద్ ముజీబ్ ఫసల్ ఉపాధ్యాయుడికి 6నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. రూ.6.48లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు సబ్ జైలుకు తరలించారు.
Similar News
News March 13, 2025
విద్యుత్ షాక్‌కు గురై ఆరేళ్ల చిన్నారి మృతి

విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. డి.హీరేహాళ్ మండలం మురిడికి చెందిన 6ఏళ్ల చిన్నారి అర్పిత స్నానం చేసేందుకు వెళ్తుండగా డోర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించి పడిపోయింది. గమనించిన తల్లి రూతమ్మ వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.
News March 13, 2025
దోమ: ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్‌కు తరలింపు

దోమ మండలం మైలారం గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొడుగోనిపల్లి నుంచి మోత్కూర్ వెళ్లే రోడ్డులో కోళ్ల ఫారం దగ్గర మోత్కూర్ గ్రామానికి చెందిన సండి సాయికుమార్, ధన్ రాజ్ అనే వ్యక్తులు బైక్‌తో ట్రాక్టర్‌కు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిగి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించగా.. అక్కడి నుంచి వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
News March 13, 2025
తాండూర్: రూ.1.30లక్షల తాకట్టు నగదు చోరీ!

తాండూరు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.1.30 లక్షల లోన్ తీసుకున్నారు. తదనంతరం మళ్లీ కారులో బయలుదేరారు. కొద్ది దూరంలో టైర్ పంచర్ కావడంతో శారద భర్త రాజు కారు టైర్ పంచర్ చేయించడానికి తీసుకెళ్లాడు. ఇదంతా గమనించిన ఓ దుండగుడు భార్య శారదకు మాయమాటలు చెప్పి కారులో నుంచి దించి డబ్బుల బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.