News February 21, 2025

పెబ్బేరు: అత్యాచారయత్నం కేసు.. నిందితుడికి రిమాండ్ 

image

పెబ్బేరు పరిధిలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన మహిళను పెబ్బేరుకు చెందిన ఎరుకలి రాముడు బలవంతంగా చెలిమిల్ల రామాలయం వెనుక వైపునకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ కేసులో ఎరుకలి రాముడుకు వనపర్తి JFCM న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని పెబ్బేరు పోలీసులు మహబూబ్నగర్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించినట్లు స్థానిక ఎస్‌హెచ్ఓ హరి ప్రసాద్ రెడ్డి తెలిపారు.

Similar News

News December 13, 2025

పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. కామేపల్లిలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. సామగ్రి పంపిణీ, ఏర్పాట్లను పర్యవేక్షించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రవీందర్, మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్, MRO సుధాకర్ పాల్గొన్నారు.

News December 13, 2025

KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల కేటాయింపుల్లో గందరగోళం

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల కేటాయింపుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియలో జరిగిన తప్పిదాల కారణంగా, ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు, బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిన ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల ఉద్యోగుల్లో అయోమయం, ఆందోళన పెరిగింది.

News December 13, 2025

₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్

image

దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-14 మధ్య 7,599 KM న్యూ ట్రాక్‌ వేస్తే, 2014-24 వరకు తాము 34,428 KM నిర్మించామని తెలిపారు. ₹6,74,920 కోట్లతో కొత్త రైల్వే లేన్లు, మల్టీ ట్రాకింగ్, గేజ్ కన్వర్షన్ చేపట్టామన్నారు. ఇప్పటికే 12,769 KMల నిర్మాణం పూర్తయిందన్నారు. పెరుగుతున్న సరకు రవాణా దృష్ట్యా నెట్వర్క్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.