News February 15, 2025

పెబ్బేరు: షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రికల్ షాప్ దగ్ధం

image

పెబ్బేరు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ షాప్ అగ్నికి ఆహుతి అయింది. షాప్ యజమాని గౌని యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. షాప్‌లో ప్లాస్టిక్, పీవీసీ సామన్లు మొత్తం కాలిపోయాయని నష్టం భారీ ఎత్తున ఉందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Similar News

News March 14, 2025

హోలీ.. సీఎం రేవంత్ పాత ఫొటోలు

image

TG: హోలీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటి ఆప్తమిత్రులతో కలిసి రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకున్నారు. మరి పై ఫొటోల్లో సీఎం ఎక్కడ ఉన్నారో గుర్తు పట్టారా? కామెంట్ చేయండి.

News March 14, 2025

కామారెడ్డి బిడ్డ.. 3 GOVT జాబ్స్ సాధించారు..!

image

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2019లో అటవీ శాఖలో బీట్ అధికారిగా కొలువులో చేరారు. ఆ కొలువు చేస్తూనే.. జేఎల్‌కు సిద్ధమయ్యారు. అంతలోనే గ్రూప్-4 పరీక్ష రాసి.. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ అయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జేఎల్ సాధించారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోస్టింగ్ వచ్చింది.

News March 14, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ (83) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అధికార్, జో జీతా వోహీ సికందర్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్-2’ను డైరెక్ట్ చేస్తున్నారు.

error: Content is protected !!