News January 26, 2025
పేకాట స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

ద్వారకాతిరుమల మండలం, లైన్ గోపాలపురంలోని ఓ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి.సుధీర్ సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 20,500 ల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. పేకాట, కోడిపందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌ఐ హెచ్చరించారు.
Similar News
News March 13, 2025
‘శ్రీ సత్య సాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మారుద్దాం’

శ్రీ సత్య సాయి జిల్లాని నేర రహిత జిల్లాగా మారుద్దామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హిందూపురం సమీపంలోని అప్పలకొండ క్రాస్ వద్ద డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. హక్కులను వినియోగించుకొని జిల్లాలను నేర రహిత జిల్లాగా మారుద్దాం అన్నారు.
News March 13, 2025
పాడేరు: ‘కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’

నేటి యువత, విద్యార్థిని, విద్యార్థులు కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రచించారని కొనియాడారు.
News March 13, 2025
సంగారెడ్డి: పోలీస్ స్టేషన్‌లకు టెన్త్ ప్రశ్నాపత్రాలు: DEO

పదో తరగతి ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్‌లకు పంపిస్తున్నామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 16న పేపర్ 1, 19న పేపర్ 2 ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్‌లకు చేరుకుంటాయని పేర్కొన్నారు. సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు డబుల్ బాక్స్ లాకర్లతో పోలీస్ స్టేషన్లకు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు చేరుకోవాలని సూచించారు.