News March 4, 2025

పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.

Similar News

News December 15, 2025

కొబ్బరి ఉప ఉత్పత్తుల పరిశ్రమలపై కలెక్టర్‌ సమీక్ష

image

కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించే దిశగా అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం క్వాయర్ బోర్డు ప్రతినిధులతో కలెక్టర్ మహేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కొబ్బరి పీచు, కోకో పిట్, జియో టెక్స్టైల్స్, డోర్ మ్యాట్ల తయారీపై చర్చించారు. జిల్లాలో క్వాయర్ పరిశ్రమల ఏర్పాటుకు గల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామని, దీనిపై వారం రోజుల్లో మరోసారి పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

News December 15, 2025

MBNR: ఆరోజు వైన్ షాపులు బంద్: ఎస్పీ

image

పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో లేదా 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధమని ఎస్పీ డి.జానకి తెలిపారు. మూడో విడుత సర్పంచ్ ఎన్నికల భద్రతా దృష్ట్యా మద్యం దుకాణాలు ఈనెల 15 సా.5:00 గంటల నుంచి 18 ఉ.10:00 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని, మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 15, 2025

MBNR: గుంపులుగా గుమికూడరాదు: ఎస్పీ

image

మూడో విడత ఎన్నికల నేపథ్యంలో 163 BNSS (144 సెక్షన్) అమల్లో ఉన్నందున ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు/అంతకన్నా ఎక్కువ మంది గుంపులుగా గుమికూడరాదని ఎస్పి డి.జానకి సూచించారు. పోలింగ్‌కు ముందు(15న) సాయంత్రం 5:00 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు,ఇంటింటా ప్రచారం,లౌడ్‌స్పీకర్ల వినియోగం,ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు.