News March 10, 2025

పొక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

image

గంట్యాడ మండలంలోని కొటారుబిల్లికి చెందిన రవి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది అక్టోబర్ 27 ఫోక్సో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టామన్నారు. నేరం రుజువు కావడంతో 134 రోజుల్లోనే శిక్ష ఖరారైందన్నారు. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష రూ.10వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. 

Similar News

News March 10, 2025

MLC అభ్యర్థి కావలి గ్రీష్మ రాజకీయ ప్రస్థానమిదే

image

సంతకవిటి(M) కావలికి చెందిన కావలి గ్రీష్మ 2015లో TDP ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2016-22 మధ్యలో రాజాం పట్టణ టీడీపీ అధ్యక్షురాలిగా, ఏరియా ఆసుపత్రి ఛైర్ పర్సన్‌గా, సీబీఎన్ ARMY రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. గ్రీష్మ శాసనసభ మాజీ స్పీకర్‌ సీనియర్ నాయకురాలు కావలి ప్రతిభా భారతి కుమార్తె. SC సామాజికవర్గానికి చెందిన గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు.

News March 10, 2025

విశాఖలో క్రికెట్ బెట్టింగ్.. బుకీ అరెస్ట్: సీపీ

image

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్,సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరుపుతుంటాడని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం తెలిసిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.

News March 10, 2025

850 మందిపై టౌన్ న్యూసెన్స్ కేసులు: VZM SP

image

జనవరి నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 850 మందిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంటలు దాటిన తరువాత సరైన కారణం లేకుండా పట్టణంలో సంచరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తునట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు.

error: Content is protected !!