News April 20, 2025
పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో మృతదేహం

మోత్కూరు మండలం పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్ రెడ్డిగా గుర్తించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.
Similar News
News April 20, 2025
మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా: వైసీపీ

AP: మెగా డీఎస్సీపై సంతకం చేసిన 10 నెలలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ Xలో విమర్శించింది. ఇది మెగా డీఎస్సీ కాదు మెగా డిసప్పాయింట్‌మెంట్ అని మండిపడింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎప్పుడు నియామకపత్రాలు ఇస్తారనే విషయమై స్పష్టత లేదని విమర్శించింది. ఈ మెగా డ్రామా పూర్తిగా పబ్లిక్ స్టంట్ అని దుయ్యబట్టింది.
News April 20, 2025
ఉరవకొండ: తమ్ముడి పెళ్లి చూపులకు వెళ్తుండగా విషాదం

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
News April 20, 2025
తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.