News January 28, 2025
పొదిలి: చెల్లిని హత్య చేసిన అన్న.. ఎందుకుంటే.!

ఇన్సూరెన్స్ నగదు కోసం ఓ అన్న కిరాతకంగా చెల్లిని చంపిన ఘటన పొదిలిలో ఏడాది క్రితం చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అతన్ని మంగళవారం అరెస్ట్ చేశారు. కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్ అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో చెల్లి సంధ్య పేరుపై వివిధ కంపెనీల్లో సుమారు కోటికి ఇన్స్యూరెన్స్ కట్టాడు. దీంతో ఆమెను గత ఏడాది 2వ నెలలో హత్యచేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు.
Similar News
News February 19, 2025
జగన్ నాసిరకం మద్యం అమ్మించాడు: మంత్రి స్వామి

జగన్ జే ట్యాక్స్ కోసం నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీశాడని మంత్రి స్వామి అన్నారు. నాటు సారా నిర్మూలనపై బుధవారం ఒంగోలులో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, నాటుసారా, మద్యం విచ్చలవిడిగా విక్రయించారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాల్లో సైతం గంజాయి, డ్రగ్స్ దోరేకవన్నారు. కూటమి పాలనలో గంజాయి, డ్రగ్స్‌ని అరికట్టేందుకు ఈగల్ వ్యవస్థని తెచ్చామన్నారు.
News February 19, 2025
ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

ప్రకాశం జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.