News April 24, 2025
పొన్నూరు: వీరయ్య చౌదరి హత్య కేసులో అదుపులోకి ఐదుగురు

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తులో ఓ కీలక మలుపు తిరిగింది. బుధవారం పోలీసులు పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రేషన్ బియ్యం అక్రమ రవాణాతో సంబంధం ఉన్నవారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఇదే మాఫియా గతంలో మరో వ్యాపారిని హత్య చేసిన రికార్డు ఉందని సమాచారం. ప్రస్తుతం ఐదుగురు అనుమానితులను ఒంగోలు తరలించి విచారణ చేపట్టారు.
Similar News
News April 24, 2025
తెనాలి: బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై NTR (D) మైలవరానికి చెందిన అవినాశ్ లైంగిక దాడికి పాల్పడగా వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు విచారించగా వెలుగులోకి రావడంతో ఫిర్యాదు చేశారు.
News April 24, 2025
ANUలో ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల 4/4 మొదటి సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మొత్తం 638 మంది పరీక్షలు రాయగా 578 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 90.12గా నమోదైంది. రీవాల్యుయేషన్ కోసం మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.
News April 24, 2025
అమరావతిలో తొలి క్వాంటమ్ విలేజ్?

అమరావతిని దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వెలగపూడిలో జరిగిన సమీక్షలో ఐటీ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. 50ఎకరాల భూమిపై ఐకానిక్ భవనం నిర్మాణానికి L&T, టెక్నాలజీ మద్దతు కోసం ఐబీఎం ముందుకొచ్చాయి. టీసీఎస్, సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.