News February 11, 2025

పొరపాట్లకు తావు లేకుండా MLC ఎన్నికలు: కలెక్టర్

image

ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గ ఎన్నికను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఈనెల 27న జిల్లాలో నిర్వహించే పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీతో కలిసి నోడల్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

Similar News

News February 11, 2025

గన్నవరం: మాయమాటలతో బాలికను లోబర్చుకున్న ఆటో డ్రైవర్

image

ఇంటర్ చదివే విద్యార్థిని(మైనర్ బాలిక)ని రోజూ తన ఆటోలో కాలేజీకి తీసుకువెళ్లే ఆటో డ్రైవర్ మాయ మాటలతో లోబర్చుకుని గర్భిణిని చేసిన ఘటన గన్నవరం మండలంలో చోటు చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు సాంబయ్య అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

News February 11, 2025

గన్నవరం TDP ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్..

image

గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్థన్ ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని న్యాయాధికారికి సోమవారం వాంగ్మూలం అందజేశారు. వైసీపీ హయాంలో TDP ఆఫీసుపై ఈ దాడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక TDP ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు. అయితే దాడి సమయంలో తాను అక్కడ లేనని, TDP నేతలు బలవంతంగా కేసు పెట్టించారని అతను ఆరోపించాడు.

News February 11, 2025

కృష్ణా: MLC స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా ఈ రోజుతో నామినేషన్ సమర్పించే గడువు ముగియగా ఈ ఒక్క రోజే 22 మంది నామినేషన్లు వేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థిగా లక్ష్మణరావు బరిలో నిలువగా, వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!