News February 9, 2025
పోక్సో కేసులో విశాఖ సెంట్రల్ జైలుకు టీచర్: ఎస్ఐ
ఇటీవల వడ్డాదిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్‌పై <<15378554>>పోక్సో కేసు <<>>నమోదు చేసినట్లు బుచ్చయ్యపేట ఎస్ఐ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. చోడవరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై హోం మంత్రి అనిత, ప్రజాసంఘాలు స్పందించిన విషయం తెలిసిందే.
Similar News
News February 10, 2025
విశాఖ: ముగిసిన నామినేషన్ల గడువు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు నేటితో ముగిసిందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఇప్పటి వరకు మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే వీరి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ 11న, ఉప సంహరణ 13న ఉంటుంది. పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన తర్వాత బరిలో ఎంత మంది నిలుస్తారన్నది తేలనుంది.
News February 10, 2025
నిర్మలా సీతారామన్‌తో విశాఖ ఎంపీ భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బడ్జెట్లో 12 లక్షల వరకు వచ్చే జీతాలకు ఆదాయపు పన్ను ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను కుదించడంతో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు.
News February 10, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి నామినేషన్లు వేసింది వీరే
➤ పాకలపాటి రఘువర్మ
➤ గాదె శ్రీనివాసులు నాయుడు
➤ కోరెడ్ల విజయ గౌరీ
➤ కోసూరు రాధాకృష్ణ
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి
➤ నూకల సూర్యప్రకాశ్
➤ రాయల సత్యనారాయణ
➤ పోతల దుర్గారావు
➤ పెదపెంకి శివప్రసాద్
➤ సుంకర శ్రీనివాసరావు
NOTE: నేటితో నామినేషన్లకు గడువు ముగిసింది.