News June 17, 2024
పోలవరంలో దొంగనోట్ల కలకలం
ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం దొంగ నోట్లు కలకలం రేపాయి. నేడు సీఎం పర్యటన నేపథ్యంలో కాఫీ హోటళ్లు, తినుబండారాల షాపులు, కిరాణా దుకాణాలు కిటకిటలాడాయి. లావాదేవీలు సమయంలో వచ్చిన కొత్తనోట్లను ఆ తర్వాత మరొకరికి ఇచ్చే సమయంలో దొంగనోట్లని తేలడంతో తాము మోసపోయినట్లు వ్యాపారులు గుర్తించారు. సుమారు ఏడుగురు వ్యాపారులు మోసపోయినట్లు గుర్తించారు.
Similar News
News November 28, 2024
ఓ రూముకు నా పేరు పెట్టి బెదిరిస్తున్నారు: RRR
తనను వేధించిన వాళ్లంతా జైలుకు వెళ్లడం వాళ్లు చేసుకున్న కర్మేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు(RRR) పేర్కొన్నారు. ‘ముసుగు వేసుకుని మరీ నన్ను కొట్టారు. ఆరోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చోవడంతో మంచం కోళ్లు కూడా విరిగిపోయాయి. నన్ను ఏ రూములో అయితే కొట్టారో దానికి RRR పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రూములోకి ఎంతోమందిని తీసుకెళ్లి బెదిరించి దందాలు చేశారు’ అని RRR చెప్పారు.
News November 28, 2024
ఏలూరు: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎస్ఐ శివాజీ వివరాల ప్రకారం.. దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి ఓనర్ కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతను అద్దెకు దిగిన వారి నాలుగేళ్ల కుమార్తెపై నవంబర్ 25న అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు.
News November 28, 2024
సమస్యైతే నాకే ఫోన్ చేయండి: చింతమనేని
‘ఇది మీ ప్రభుత్వం. మీ శ్రేయస్సు మాకు ముఖ్యం’ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం వంగూరులో బడి బస్సు ఆలస్యంగా వెళ్లింది. దీంతో ఆయన బుధవారం రాత్రి విద్యార్థులతో మాట్లాడారు. ఏ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలిగినా సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు స్పందించకపోతే నేరుగా తనకు కాల్ చేస్తే నేరుగా వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.