News February 13, 2025

పోలింగ్ కేంద్రాల జాబితా అందజేత: అదనపు కలెక్టర్

image

రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు గురువారం హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈవో విద్యాలత అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చన్నారు.

Similar News

News February 14, 2025

పులివెందుల : శ్రీ వెంకటరమణుడికి స్నపన తిరుమంజన సేవ

image

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందుల పట్టణంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి స్నపన తిరు మంజనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.

News February 14, 2025

బాపట్ల: ‘పరిశ్రమలకై ఔత్సాహికులను ప్రోత్సహించాలి’

image

పరిశ్రమల స్థాపన కొరకు ఔత్సాహికులను మరింత ప్రోత్సహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక, అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జరిగింది. బాపట్ల జిల్లాలోని వివిధ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News February 14, 2025

విద్యార్థులు సమాజంలో ఆదర్శంగా నిలవాలి: కడప ఎస్పీ

image

విద్యార్థులు ఉత్తమ చదువులతో అత్యున్నత స్థానాలకు చేరుకొని సమాజంలో ఆదర్శంగా నిలవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు గురువారం ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలిచి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!