News June 12, 2024
పోలీస్ అధికారినంటూ వైద్యుడికి బెదిరింపు

భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడికి మంగళవారం ఓ వ్యక్తి ఫోన్ చేసి పోలీస్ అధికారినంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వైద్యుడు ఎవరికి చెప్పాలో అర్థంకాక కొంతసేపు ఇబ్బంది పడ్డారు. చివరకు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ను ఆశ్రయించి విషయం వివరించారు. అయితే సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిసింది. అయితే సదరు వైద్యుడు ఫిర్యాదు చేయలేదని సమాచారం.
Similar News
News December 13, 2025
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. కామేపల్లిలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. సామగ్రి పంపిణీ, ఏర్పాట్లను పర్యవేక్షించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రవీందర్, మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్, MRO సుధాకర్ పాల్గొన్నారు.
News December 13, 2025
ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ

నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ శనివారం పరిశీలించారు. ఆమె బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి సరఫరా ప్రక్రియను పర్యవేక్షించి, ఎన్నికల సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. సిబ్బంది జాగ్రత్తగా విధులను నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎర్రయ్య, ఎంపీఓ శివ పాల్గొన్నారు.
News December 13, 2025
ఖమ్మం: క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిశీలించిన సీపీ

ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. రూరల్ మండలంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,059 కేసుల్లో 7,129 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


