News April 22, 2025
పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు మొబైల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 22, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి విక్రయాలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇటీవల వర్షాలు, ధర పెరుగుతుందన్న కారణంగా రైతులు మార్కెట్‌కు పత్తిని తక్కువగా తీసుకొస్తున్నారు. పత్తి విక్రయాలు స్వల్పంగా ధర పెరిగింది. ప్రస్తుతం పత్తి నాణ్యతను బట్టి క్వింటాల్‌కి రూ.6,800 నుంచి రూ.7,200 వరకు ధర పలుకుతోంది.
News April 22, 2025
పెద్దపల్లి: ఆర్ఎంపీలకు వైద్య అధికారిణి హెచ్చరిక

పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎంపీలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి అన్న ప్రసన్న కుమారి పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్ఎంపీలు తమ పరిధిలోనే ఉండాలని, కేవలం ప్రథమ చికిత్సకే పరిమితమవ్వాలని సూచించారు. అనధికారికంగా మేజర్ చికిత్సలు చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News April 22, 2025
జాతీయ పోటీలకు ఎంపికైన ధర్మారం మండల విద్యార్థిని

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని రేవెల్లి శిరీష జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరపున ఆమె పాల్గొననుంది. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు శిరీషను అభినందిస్తున్నారు.