News February 2, 2025

పోలీస్ వృత్తి అంటేనే ఓ గొప్ప సేవ: ఎస్పీ

image

పోలీస్ వృత్తి అంటేనే ఒక గొప్ప సేవ అని, సమాజానికి మనం చేసిన సేవలు దగ్గరగా చూడటానికి ఏకైక వృత్తి అంటే పోలీస్ వ్యవస్థ అని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ధర్మవరం టూ టౌన్ కానిస్టేబుల్ రామగిరి, రామలింగారెడ్డి, ఏఆర్ ఎస్‌ఐ సుబ్బరంగయ్య పదవీ విరమణ సందర్భంగా వారిని ఎస్పీ ఘనంగా సన్మానించారు. పోలీస్ వ్యవస్థలో బాగా పనిచేస్తే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.

Similar News

News March 10, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ ఇసుక అక్రమ రవాణా.. చర్యలు తీసుకుంటాం: మణుగూరు MRO ✓ రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ✓ రేపు పినపాక, కరకగూడెంలో పర్యటించనున్న ఎమ్మెల్యే పాయం ✓ పొదెం వీరయ్య, నాగ సీతారాములకు దక్కని ఎమ్మెల్సీ ✓ భద్రాద్రి: మాదిగలను మంత్రివర్గంలో తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ ✓ కొత్తగూడెం: మొక్కల ప్రేమికుడు విశ్వామిత్రను అభినందించిన హైకోర్టు జడ్జి ✓ పినపాకలో తల్లికి తలకొరివి పెట్టిన కూతుళ్లు.

News March 10, 2025

నల్గొండ: కప్పు కొట్టిన భారత్‌కు మాజీ ఎమ్మెల్యే అభినందనలు

image

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియాకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. NZతో మరోసారి ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది భారత్. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు. 

News March 10, 2025

భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ.. యాదాద్రిలో సంబరాలు

image

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ భారత్ జట్టు గెలవడంతో సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో యువకులు జాతీయ పతాకంతో సంబరాలు జరుపుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో కప్పును ముద్దాడడంతో గుజ్జ గ్రామస్థులు ఆనందాల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఎలిజాల శ్రీను, చాడ శ్రీను, వెంకటేశ్, శ్రీకాంత్, సమరం, లింగస్వామి, సీతారాం, ప్రకాశ్ పాల్గొన్నారు.

error: Content is protected !!