News April 8, 2025

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి: నరసింహస్వామి

image

మహబూబాబాద్ జిల్లాలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నరసింహస్వామి తెలిపారు. 2024-2025 సంవత్సరానికి గాను జిల్లాలో చదువుతున్న (SC,ST,BC,OC,EBC) విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈనెల 31 లోపు https://www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News April 19, 2025

రామాపురం: మృతుడు TDP నాయకుడిగా గుర్తింపు

image

అన్నమయ్య జిల్లా రామాపురంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హసనాపురం పంచాయతీ గొల్లపల్లికి చెందిన TDP నాయకుడు ఇరగంరెడ్డి(50) కడపలో బంధువుల పెళ్లికి బైకుపై బయల్దేరారు. రామాపురం పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వెళ్తున్న కారు ఢీకొట్టడంతో చనిపోయారు. ఆయన మృతికి మంత్రి మండిపల్లి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మృతి TDPకి తీరని లోటని పేర్కొన్నారు.

News April 19, 2025

కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

image

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్‌ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 19, 2025

కంది: జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలి: డీఈఓ

image

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్‌లను మూసివేయాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేందుకు పరీక్ష కేంద్రాల సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరారు.

error: Content is protected !!