News March 21, 2025
ప్రకాశం: అన్నాదమ్ములు మృతి.. UPDATE

ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పడమటపల్లిలో గురువారం చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుల వివరాలను పోలీసులు వెళ్లడించారు. గ్రామానికి చెందిన బత్తుల అభిషేక్ (10), బత్తుల పాల్ (8)గా గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు ఒకే కుటుంబానికి చెందిన <<15827660>>అన్నదమ్ములు<<>> కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News March 30, 2025
ఒంగోలులో ఘనంగా ఉగాది వేడుకలు

ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, MLA విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News March 30, 2025
కంభం : కరెంటు వైర్లు తగిలి వ్యక్తి మృతి

కంభం మండలంలోని లింగాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. కుందేళ్ల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి వెలిగొండయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కుందేళ్ల వేట కోసం స్వయంగా తానే పెట్టిన కరెంటు వైర్లను ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి ఈ ఘటన జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
News March 30, 2025
ప్రకాశం: వైసీపీ ఉద్యోగ పెన్షనర్ విభాగ అధ్యక్షులు వీరే..!

ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల ఉద్యోగ పెన్షనర్ల విభాగ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల వివరాలను కిందిలా ఉన్నాయి.
>గిద్దలూరు- బంగారు విశ్వరూపం
>కనిగిరి – ఏకుల వెంకట సుబ్బారెడ్డి
>దర్శి – రావులపల్లి గురుప్రసాద్
>కొండేపి- పి కృష్ణమూర్తి
>మార్కాపురం – టీ రంగారెడ్డి
>ఒంగోలు – పెట్లూరి ప్రసాద్‌లు నియమితులయ్యారు.