News March 31, 2025

ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

image

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News April 3, 2025

ప్రకాశం: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

image

స్థల వివాదం నేపథ్యంలో CISF కానిస్టేబుల్‌ నాగేశ్వరరావుపై దాడి చేశారు. ఈ ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో జరిగింది. భరత్, వీరయ్య, లక్ష్మీనారాయణకు, నాగేశ్వరరావుకు స్థల గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌పై మరో ఇద్దరితో కలిసి వారు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో బుధవారం 5గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

News April 3, 2025

ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సబ్జెక్టు వారిగా సాధారణ సీనియార్టీ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే ఈనెల 9వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.

News April 2, 2025

ప్రకాశం: రేపటి నుంచి పది మూల్యాంకనం ప్రారంభం

image

ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ హైస్కూలులో పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 3 నుంచి 9వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్‌ తెలిపారు. పరీక్షల మూల్యాంకనానికి 150 గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 150 మంది చీఫ్‌ ఎగ్జామినర్స్‌, 600 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్‌, 300 మంది స్పెషల్‌ అసిస్టెంట్స్‌ను తీసుకున్నామన్నారు. జిల్లాకు మొత్తం 1,90,000 పేపర్లు కేటాయించినట్లు తెలిపారు.

error: Content is protected !!