News January 7, 2025
ప్రకాశం జిల్లా ప్రజలు భయపడకండి: DMHO
బెంగళూరులో HMPV కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి ప్రకాశం జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా DMHO టి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
Similar News
News January 9, 2025
కొత్త వైరస్.. ఒంగోలు GGHలో 20 బెడ్లు ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎంపీ వైరస్ నివారణలో భాగంగా.. ఒంగోలులోని GGHలో 20 బెడ్లు ఏర్పాటు చేశామని, ఎక్స్‌పర్ట్ కమిటీతోపాటు పలు కమిటీలను నియమించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. మగవారికి 10 బెడ్లు, మహిళలకు 10 బెడ్ల చొప్పున ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డాక్టర్ కళ్యాణి HOD జనరల్ మెడిసిన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు.
News January 9, 2025
ప్రకాశం: ‘రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మరింత గౌరవాన్ని పెంచే విధంగా వైద్యులు పనిచేయాలని కలెక్టరు తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (జీజీహెచ్) సందర్శించి అన్నీ విభాగాల హెచ్ఓడిలతో సమావేశమై, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ, అందిస్తున్న వైద్య సేవలపై క్షుణ్ణంగా సమీక్షించారు.
News January 9, 2025
ఇల్లు నిర్మించుకునేవారికి శుభవార్త: బాపట్ల కలెక్టర్
బాపట్ల జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ PMAY 2.0 పథకం క్రింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. విజన్ బాపట్ల-2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందన్నారు.