News April 20, 2024

ప్రకాశం జిల్లాలో నేడు 14 నామినేషన్ల స్వీకరణ

image

జిల్లా వ్యాప్తంగా శనివారం ఒంగోలు పార్లమెంట్ స్థానానికి, మిగిలిన నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. ఒంగోలు పార్లమెంటుకు 4 నామినేషన్లు, యర్రగొండపాలెంలో 1, దర్శికి 2, ఒంగోలుకు 1, కొండపికి 4, గిద్దలూరుకు 2 చొప్పున నామినేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు నామినేషన్ సమర్పిస్తున్న సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

Similar News

News April 23, 2025

చంద్రబాబే లిక్కర్‌ స్కాం చేశారు: తాటిపర్తి

image

లిక్కర్ స్కాంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసలు లిక్కర్‌ స్కాం ఎవరు చేశారు? 2014-19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్‌ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబే స్కాం చేశారని రాష్ట్రప్రభుత్వానికి చెందిన సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు ఏమైంది? ఎందుకు నడవడం లేదు? ’ అని ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్ చేశారు.

News April 23, 2025

ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

image

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

News April 23, 2025

పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

image

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరిం‌త పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని‌ జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం‌ నియామక‌పత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని‌ సూచించారు.

error: Content is protected !!