News March 10, 2025

ప్రకాశం జిల్లాలో సూపర్ ఫొటో..❤

image

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో కొండలను చీల్చుకుంటూ సూర్యుడు ఇలా బయటకు వచ్చాడు. ఇదే సమయంలో కొండలను తాకేలా మేఘాలు రావడంతో చూపరులను కనువిందు చేసింది. అటుగా వెళ్లిన వాళ్లు ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు.

Similar News

News March 10, 2025

పోర్టు పనుల్లో కందుకూరు MLA దందా..?

image

కందుకూరు టీడీపీ MLA ఇంటూరి నాగేశ్వర రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ‘రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కావాలని MLA కోరగా కాంట్రాక్టర్ ఇవ్వలేదు. పోర్టు పనులకు కంకర, ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీకి వెయ్యి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లతో ఆ వాహనాలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ వ్యవహారం సీఎం ఆఫీసుకు చేరినా ఎమ్మెల్యే దందా ఆపడం లేదు’ అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

News March 10, 2025

పెద్ద దోర్నాల హైవేలో సొరంగ నిర్మాణం..?

image

పెద్ద దోర్నాల మీదుగా రాయలసీమ ప్రాంతానికి వెళ్లే శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరించనున్నారు. ఈ ప్రతిపాదనలో మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ మార్గంలో పెరుగుతున్న వాహనాల రద్దీని పరిష్కరించడానికి సొరంగ మార్గం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. సొరంగం నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు ఉండవని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 9, 2025

ప్రకాశం జిల్లా YCP నాయకులకు పదవులు.!

image

YS జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు YCP నాయకులకు శనివారం రాష్ట్రస్థాయి పదవులు వరించాయి.
➤రాష్ట్ర మహిళా కార్యదర్శిగా భూమిరెడ్డి రవణమ్మ
➤చెప్పలి కనకదుర్గ
➤మాదాల వెంకట సుబ్బారావు
➤సిరిగిరి గోపాల్‌రెడ్డి
➤దోగిపర్తి రంజిత్ కుమార్
➤బత్తుల అశోక్ కూమార్ రెడ్డి
➤కంచర్ల సుదాకర్ బాబు
➤మేడా వెంకట బద్రీనారాయణ నియమితులయ్యారు.

error: Content is protected !!