News July 26, 2024

ప్రకాశం: డీఈఐఈడీ సప్లిమెంటరీ ఫీజు చెల్లించండి

image

డీఈఐఈడీ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి మొదటిసారి ఫెయిలైన విద్యార్థులు(2018-20) ఆగస్టు 4వ తేదీలోగా ఫీజు చెల్లించాలని డీఈఓ సుభద్ర తెలిపారు. నాలుగు సబ్జెక్టులకు రూ.150, మూడు సెబ్జెక్టులకు 140, రెండు సబ్జెక్టులకు రూ.120. ఒక సబ్జెక్టుకు రూ.100 అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 4వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. అపరాధ రుసుం రూ.50తో ఆగస్టు 19వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

Similar News

News November 5, 2024

పామూరు: మద్యం మత్తులో ముగ్గురిపై కత్తితో దాడి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన పామూరు మండలం నుచ్చుపొదలలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. తిరుపాల్ రెడ్డి, సురేంద్ర శనివారం మద్యం మత్తులో గొడవపడ్డారు. సురేంద్ర స్థానిక నేత రహముతుల్లా సహాయంతో తిరుపాల్ రెడ్డిని పిలిపించి పంచాయితీ పెట్టారు. ఆగ్రహంతో తిరుపాల్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో రహముతుల్లా కుమారుడు నిజాముద్దీన్, బంధువు హజరత్, సురేంద్రలపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు.

News November 5, 2024

ప్రకాశం: నేటి నుంచి డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలోని 88 డిగ్రీ కళాశాలలో చదువుతున్న మూడో సెమిస్టర్ విద్యార్థులకు నవంబర్ 5వ తేదీ నుంచి, 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్శిటీ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలకు గాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 88 డిగ్రీ కళాశాల నుంచి మొత్తం 6942 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు  తెలిపారు.

News November 4, 2024

రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లా YCP సమీక్షా సమావేశాలు

image

ప్రకాశం జిల్లా రీజనల్ కో- ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి రేపు ఉదయం మంగళవారం 10:00 గంటలకు ఒంగోలు పార్టీ ఆఫీస్‌లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మండల పార్టీ అధ్యక్షుడు, MPPలు, ZPTCలు, మున్సిపల్ ఛైర్మన్‌లు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.