News January 6, 2025

ప్రకాశం: నకిలీ పెన్షన్లపై వేటుకు రంగం సిద్ధం

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్‌ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.

Similar News

News January 8, 2025

ప్రకాశం జిల్లాలో నేడు మోదీ ప్రారంభించేవి ఇవే..!

image

ప్రకాశం జిల్లాలో వివిధ పనులకు ప్రధాని మోదీ విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. దోర్నాల-కుంట జంక్షన్(రూ.245 కోట్లు), వెలిగోడు-నంద్యాల(రూ.601 కోట్లు) రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుడతారు. అలాగే రూ.108 కోట్లతో గిద్దలూరు-దిగువమెట్ట డబ్లింగ్ పనులకు భూమి పూజ చేస్తారు. రూ.907 కోట్లతో పూర్తి చేసుకున్న 6 వరుసల చిలకలూరిపేట బైపాస్‌ను ప్రారంభిస్తారు.

News January 8, 2025

కొరిశపాడు: చికిత్స పొందుతూ బాలుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మవరం రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద నివాసం ఉండే దుర్గారావు కుమారుడు నాగరాజు(2) ఇంటి బయట ఆడుకుంటూ నాలుగో తేదీన ఎలుకల పేస్టు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. హాస్పటల్ నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని మేదరమెట్ల ఎస్ఐ మొహమ్మద్ రఫీ తెలిపారు.

News January 8, 2025

RRR కేసులో తులసిబాబుకు మరోసారి నోటీసులు

image

శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబుకు మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు ఎస్సీ దామోదర్ చెప్పారు. ఈనెల 8న ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈనెల 3న హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా గైర్హాజరయ్యాడు.