News April 29, 2024

ప్రకాశం: నేటి నుంచి ఓపెన్ స్కూలు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు

image

ఏపీ ఓపెన్ స్కూలు సొసైటీ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈవో సుభద్ర తెలిపారు. పరీక్షలు జూన్ 1 నుంచి 8వతేదీ వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఓపెన్ సొసైటీ స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లు ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలను తెలియజేయాలని చెప్పారు.

Similar News

News October 15, 2024

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తీర ప్రాంతంలో ఉండే ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం పాకల, ఊళ్లపాలెం గ్రామాలలోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో ఉండే ప్రజలు వర్షాలకు బయటకు రావద్దన్నారు.

News October 15, 2024

ప్రకాశం: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

ప్రకాశం జిల్లాలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మద్దిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికకు ఎడవల్లి హనుమంతరావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేయబోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ శివరామయ్య వెల్లడించారు.

News October 14, 2024

ప్రకాశం జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా ప్రకాశం జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఏవైనా సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులను తక్షణమే ఇతర హాస్టల్లోకి, సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని అధికారులకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.