News November 18, 2024

ప్రకాశం: పిల్లలకు బైకులు ఇస్తున్నారా.. జాగ్రత్త!

image

పోలీసులు ప్రతిరోజు ఏదొక రూపంలో వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్టులు పెట్టుకోండి అని హెచ్చరిస్తూనే ఉంటారు. కాని వాటిని తేలిగ్గా తీసుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఒంగోలులో జరిగిన ఘటన ఒక ఉదాహరణ. ముగ్గురు విద్యార్థులు స్కూటీపై హెల్మెట్ లేకుండా ప్రయాణించారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో ముగ్గురూ చనిపోయారు. అదే హెల్మెట్ ధరించి ఉంటే వారు బతికే వారని స్థానికులు పేర్కొన్నారు.

Similar News

News November 19, 2024

ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 62 ఫిర్యాదులు

image

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా.. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ దామోదర్ మాట్లాడారు. ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు.

News November 18, 2024

BREAKING: దోర్నాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు సమీపంలో గల వెలిగొండ ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తల్లి, కూతురు లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. బైకు నడుపుతున్న భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News November 18, 2024

చీరాల: అంతర్జాతీయ పోటీల్లో హెడ్ కానిస్టేబుల్

image

అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో చీరాల టూటౌన్ ఎస్బి విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ నాగరాజు సత్తా చాటి 40+ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వెస్ట్ బెంగాల్ లోని న్యూ కూచ్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి 17 వరకు పోటీలు జరిగాయి. దీంతో పలువురు ప్రముఖులు నాగరాజు ప్రతిభను అభినందిస్తున్నారు. షాట్ పుట్‌లో గోల్డ్, జావిలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించారు.