News December 2, 2024
ప్రకాశం: ‘ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందన్నారు. అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
Similar News
News December 26, 2024
ప్రకాశం: జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా పేరయ్య
జిల్లా మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు గురువారం మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా గొల్లపోతు పేరయ్య, వైస్ ప్రెసిడెంట్గా కావేరి. రాములు, మరో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పేరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News December 26, 2024
ప్రకాశం: 6,481 హెక్టార్లలో పంట నష్టం
ఈ నెల 24 నుంచి 26 వరకు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో మొత్తం 6,481 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News December 26, 2024
శానంపూడిలో యువతి ఆత్మహత్య
సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.