News April 2, 2025
ప్రకాశం: రేపటి నుంచి పది మూల్యాంకనం ప్రారంభం

ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూలులో పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 3 నుంచి 9వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్ తెలిపారు. పరీక్షల మూల్యాంకనానికి 150 గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 150 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 600 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 300 మంది స్పెషల్ అసిస్టెంట్స్‌ను తీసుకున్నామన్నారు. జిల్లాకు మొత్తం 1,90,000 పేపర్లు కేటాయించినట్లు తెలిపారు.
Similar News
News April 4, 2025
టంగుటూరులో కారు ఢీకొని ఒకరి మృతి

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీ కొనటంతో అతని తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 4, 2025
ప్రకాశం: లక్ష్యాల మేరకు రుణాలు అందించండి: కలెక్టర్

బీసీ, ఈబీసీ, కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా బ్యాంకర్లను కోరారు. గురువారం బీసీ కార్పోరేషన్ బ్యాంకుల అధికారులతో సమావేశమై, బీసీ కార్పోరేషన్ ద్వారా బీసీ, ఓసి, వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద మంజూరు చేసిన యూనిట్స్ గ్రౌండింగ్ పురోగతి పై సమీక్షించారు.
News April 3, 2025
ప్రకాశం జిల్లా వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు

ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. గురువారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని హెచ్చరించారు. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని అధికారులు పేర్కొన్నారు.