News March 15, 2025
ప్రకాశం: హాల్ టికెట్‌తో ఫ్రీ జర్నీ

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో అల్ట్రా, పల్లె వెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ జిల్లా అధికారి వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌలభ్యం ఆర్టీసీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 15, 2025
ప్రకాశం జిల్లా టీచర్‌కు నేషనల్ అవార్డు

ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ గాయత్రి విభిన్న ప్రతిభావంతుల జాతీయ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన కార్యక్రమంలో ఆమె తన సాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో అవార్డు అందుకున్నారు. ఆమెను స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు.
News March 14, 2025
కనిగిరిలో యువకుడి ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లూరు మండలానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. దీంతో ఆమె కనిగిరిలోని పుట్టింటికి వచ్చింది. ఆమెకు సత్తెనపల్లికి చెందిన రవితేజ(28) పరిచయమమ్యాడు. ‘నిన్నే పెళ్లి చేసుకుంటా. మీ అమ్మానాన్నతో మాట్లాడతా’ అంటూ రవితేజ కనిగిరికి వచ్చాడు. ఆమె వద్దని చెప్పడంతో వెళ్లి ఫుల్‌గా మద్యం తాగాడు. మరోసారి ఆమె ఇంటికి వచ్చి చేయి కోసుకోవడంతో చనిపోయాడు.
News March 14, 2025
ప్రకాశం: మరో అధికారి సస్పెండ్

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని ఓ భూమి విషయంలో జరిగింది. ఇందులో సర్వేయర్ వెంకటేశ్వర రెడ్డి పాత్రపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే స్థల వివాదంలో తహశీల్దార్ బాల కిషోర్, వీఆర్వోను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సస్పెండ్ అయిన అధికారుల సంఖ్య 3కి చేరింది.