News April 3, 2025

ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే ఆపాలి: ప్రొ.హరగోపాల్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే నిలిపివేసి, గచ్చిబౌలి కంచ గచ్చిబౌలిలో అడవిని నాశనం చేయకూడదని ప్రొ.హరగోపాల్ సూచించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ అడవి ఎంతో సుసంపన్నమైన ప్రకృతి అని, చూస్తే కానీ అర్థం కాదన్నారు. ఈ అడవిలో ఎన్నో రకాల అరుదైన పక్షి జాతులు ఉన్నాయని, ఒకసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి వందల ఏళ్లు పడుతుందని తెలిపారు.

Similar News

News April 4, 2025

HYD: చారిత్రాత్మక కట్టడాలు.. చెత్తతో స్వాగతాలు

image

చారిత్రాత్మక కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అధికారుల అలసత్వం, క్రమశిక్షణ లేని జనం మూలంగా మురికి కూపంలా మారుతున్నాయి. అందుకు నిదర్శనం పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద ఉన్న వాటర్ ఫౌంటెన్. సందర్శకులను ఎంతగానో అలరించిన నిజాంకాలం నాటి ఫౌంటెన్‌ వద్ద నేడు శుభ్రత కరవైంది. మంచినీటికి బదులు మురికి నీరు దాని నిండా ఖాళీ వాటర్ బాటిల్స్, చెత్త చెదారంతో స్వాగతం పలుకుతున్నాయి.

News April 4, 2025

IIT హదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్

image

ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.

News April 4, 2025

HYDలో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు: CP

image

శ్రీరామనవమి శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. తాజాగా సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్రకు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP స్పష్టం చేశారు.

error: Content is protected !!