News February 4, 2025
ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన కలెక్టర్
నంద్యాల మండలం పాండురంగాపురంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంగళవారం గ్రామంలోని మధుసూదన్ రెడ్డి, కేశవ్ రెడ్డి పొలాలను పరిశీలించి, వారు అవలంభిస్తున్న విధానాలను సమీక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి, వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ రసాయన రహిత సాగుతో వచ్చిన లాభాలను కలెక్టర్‌కు వివరించారు.
Similar News
News February 5, 2025
MBNR: ‘క్షయ వ్యాధి పరీక్షల సంఖ్యను పెంచండి’
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చేయాలని పరీక్షల సంఖ్యను వెంటనే పెంచాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులను ముందుగా గుర్తించేందుకు అవసరమైన ఎక్స్ రే లను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ కృష్ణ పాల్గొన్నారు.
News February 5, 2025
GWL: పొదుపు (పొదుపు నిధి) పథకం పునః ప్రారంభం: కలెక్టర్
తెలంగాణ చేనేత అభయ హస్త పథకంలో భాగంగా తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి) పథకంను పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బియం. సంతోష్ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వారు కనీసం 50% చేనేత వృత్తి నుంచి ఆదాయం పొందే కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడు ప్రతినెల 15 లోపల తను సంపాదించిన వేతనం నుంచి 8% RD-1కు జమ చేసుకోవాలన్నారు.
News February 5, 2025
HYD: యూరిన్ శాంపిల్ లేకుండానే ఇన్ఫెక్షన్ల గుర్తింపు!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సహాయంతో యూరిన్ శాంపిల్ తీసుకోకుండానే మూత్ర ఇన్ఫెక్షన్లను గుర్తించి.. HYD సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా సైన్వీ బయోసైన్స్, ఆస్ఫైర్ బయోనెస్ట్ సంయుక్తంగా మోడల్ ఆవిష్కరించింది. 2024లో జరిగిన AI ఆధారిత ఆవిష్కరణల్లో ప్రపంచ స్థాయిలో 24వ ర్యాంకును ఈ మోడల్ దక్కించుకుంది. రాబోయే రోజుల్లో ఏఐ అద్భుతాలు సృష్టించబోతున్నట్లు డాక్టర్లు తెలిపారు.