News February 28, 2025

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా బడ్జెట్: గొట్టిపాటి

image

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు బడ్జెట్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన తర్వాత అన్ని రంగాలకు ప్రాధాన్య‌త ఇస్తూ రూ.3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక‌ బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. తాను మంత్రిగా ఉన్న ఇంధ‌న శాఖ‌కు రూ.13,600 కోట్ల బడ్జెట్ కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 1, 2025

చరిత్రలో ఈరోజు.. మార్చి 1

image

* 1901- ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1968- భారత మాజీ వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి జన్మదినం
* 1969- ఇండియన్ రైల్వేస్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టారు. తొలి రైలు ఢిల్లీ, కోల్‌కతా మధ్య నడిచింది
* 1986- తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు

News March 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 1, 2025

జెలెన్‌స్కీ ఉక్కిరిబిక్కిరి.. ట్రంప్ రాకతో అంతా తారుమారు

image

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు US అండగా నిలిచింది. బైడెన్ ప్రభుత్వం ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చడంతో రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిచ్చింది. కానీ ఇటీవల US ఎలక్షన్స్‌లో బైడెన్ ఓటమితో అంతా తారుమారైంది. అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు నిధులను ఆపేశారు. అసలు యుద్ధమంతా జెలెన్‌స్కీ వల్లే వస్తోందని మండిపడ్డారు. ఈక్రమంలోనే US పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీని మీడియా ముందే తిట్టిపోశారు.

error: Content is protected !!