News April 7, 2025
ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజల నుంచి 75 దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 19, 2025
ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
వ్యవసాయంలో నూతన సాంకేతికతను అలవర్చుకోవాలి: రాజనర్సింహ

రైతులందరూ నూతన సాంకేతిక నలబరుచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పండగల మార్చిందన్నారు. రాయికోడ్ ప్రాంతానికి లిఫ్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
News April 19, 2025
మైనర్ మినరల్ పాలసీ రిలీజ్ చేసిన ప్రభుత్వం

AP: రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఖనిజాల పాలసీ-2025 విడుదల చేసింది. అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే దీని ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. 2022 మార్చి 13 వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే లీజు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌లాంటి ఖనిజాలున్న భూములను 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. మరోవైపు, యాన్యువల్ డెట్ రెంట్ మూడు నెలల్లోగా కట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది.