News May 3, 2024
ప్రజలకు అందుబాటులో ఉంటూ గెలిపించండి: డీకే అరుణ
ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తనను గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజలను కోరారు. శుక్రవారం ఆమె మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి పైప్ లైన్ వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించానని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు.
Similar News
News January 3, 2025
MBNR: చదివింది చారెడు.. చికిత్సలు బారెడు!
అసలే గ్రామీణ ప్రాంతాలు.. అంతంతే వైద్య సేవలు. దీనినే పెట్టుబడిగా పెట్టుకుని పాలమూరులో కొందరు నకిలీ RMPలు చెలరేగిపోతున్నారు. చదివింది చారెడు.. చికిత్సలు బారెడు అనేలా.. వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై DMHO కృష్ణ వివరణ కోరగా.. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
News January 3, 2025
నల్లమల విద్యార్థికి బంగారు పతకం
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. భరత్ ప్రస్తుతం అచ్చంపేట రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.
News January 2, 2025
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కృష్ణ మనోహర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కృష్ణ మనోహర్ గౌడ్ చేసిన సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించినట్లు నరేందర్ గౌడ్ వెల్లడించారు.