News April 14, 2025

ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం: మంత్రి 

image

ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాటారంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 2005 మహిళా సంఘాలకు రూ.3,12,64,235 చెక్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పంపిణీ చేశారు. రూ.కోటితో నిర్మించనున్న స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Similar News

News April 17, 2025

రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?

image

TG: ఇటీవల బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ మినహా రూ.500కు పైగా ధర ఉండే లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు సమాచారం. దీని ప్రకారం బాటిల్‌పై మినిమమ్ రూ.50 పెరిగే అవకాశముంది. ఆయా బాటిళ్ల ఎమ్మార్పీ ఆధారంగా రేట్లు పెరగనున్నాయి. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News April 17, 2025

పలాయనం చిత్తగించిన కూటమి నేతలు: రోజా

image

AP: దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని ట్వీట్లు చేసిన కూటమి నేతలు ఫోన్ ఎత్తకుండా పలాయనం చిత్తగించారని వైసీపీ నేత రోజా ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ప్రూఫ్‌లతో సహా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఛాలెంజ్‌లు విసరకూడదని ఆమె మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమ నేతల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు.

News April 17, 2025

చికిత్సకు డబ్బులు వేస్ట్ అని రియల్టర్ సూసైడ్?

image

UPలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ రియల్టర్ తుపాకీతో భార్యను కాల్చి చంపి, తనను తాను కాల్చుకున్నాడు. చికిత్సకు అనవసరంగా డబ్బు ఖర్చు చేసేందుకు ఇష్టం లేక చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్‌లో రాశారు. ఘజియాబాద్‌కు చెందిన కుల్దీప్ త్యాగి (46), అన్షు త్యాగి భార్యాభర్తలు. ఇటీవల కుల్దీప్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్సకు డబ్బులు వెచ్చించే బదులు మిగిలించడం మేలని భావించి ప్రాణాలు తీసుకున్నారు.

error: Content is protected !!