News April 11, 2025

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం: MP కావ్య

image

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కనకదుర్గ కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్‌ను ఎంపీ కడియం కావ్య కట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

Similar News

News December 19, 2025

NZB: 20న కలెక్టరేట్‌లో ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమం: కలెక్టర్

image

వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమం ‘ మీ డబ్బు- మీ హక్కు’ లో భాగంగా ఈ నెల 20న కలెక్టరేట్ లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.

News December 19, 2025

HYD: దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం ఎక్కడంటే?

image

‘ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!’ శీర్షికన Way2Newsలో కథనం వెలువడడంతో జనాల్లో చర్చ హోరెత్తింది. నిర్మాణం ఎక్కడా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. మేడ్చల్ (D) యమ్నాంపేట్ రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో 7ఎకరాల్లో 72 అంతస్తుల టవర్‌తో పాటు 62అంతస్తుల 2భవనాల నిర్మాణానికి ఓ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ‘డాన్సింగ్ డాఫోడిల్స్ థీమ్’తో రూపుదిద్దుకునే ఈ కట్టడం గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనువిందు చేయనుంది.

News December 19, 2025

బ్రిక్స్ పుస్తకాన్ని సీఎంకు అందజేసిన ఎంపీ శబరి

image

బ్రెజిల్‌లో జరిగిన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌లో విడుదల చేసిన ప్రత్యేక పుస్తకాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సీఎం చంద్రబాబు నాయుడుకు శుక్రవారం అందజేశారు. ఈ పుస్తకంలో ఎంపీ ప్రసంగాలు, ఫొటోలు, ఆమె భాగస్వామ్య విశేషాలను పొందుపరచారు. మహిళా సాధికారత, AI, వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్య విలువలపై గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో భారతదేశం తరఫున గొంతు వినిపించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.