News March 14, 2025

ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు SP అఖిల్ మహాజన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూచనలు చేశారు.★ వాహనాలు నడిపే వారిపై రంగులు చల్లుతూ ఇబ్బందులు కలిగించకూడదు★ ఇతరుల అనుమతి లేకుండా రంగులను పూయరాదు★ మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు★ సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం శ్రేయస్కరం★ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు

Similar News

News March 14, 2025

ఆదిలాబాద్: PHOTO OF THE DAY

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.

News March 14, 2025

ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌లో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News March 14, 2025

వేమనపల్లిలో పండగ పూట విషాదం

image

మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలానికి చెందిన కంపెల రాజ్ కుమార్ (20) శుక్రవారం హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.

error: Content is protected !!